RPLI VEDIO OF TENALI DIVISION

Sunday 7 April 2013


మీ కోసం

Description

మీ కోసం నాలుగు మంచి మాటలు

సాధించాలన్న కోరిక వున్నప్పుడే మనం అనుకున్నది సాధించగలము. సాధించాలన్న తపన వున్నప్పుడే మనలో ఏమీ చేయాలన్నా ధైర్యం వస్తుంది. మనం మన లక్ష్యాన్ని ఎప్పుడూ కళ్ళముందే వుంచుకోవాలి. దానిని ఎలా సాధించాలి. ఏవిధంగా సాధించాలి. సాధించాలంటే ఎటువంటి శ్రద్ధ పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు మన మనస్సులో వుండాలి. ఇక్కడ సాధించడానికి తపన అనేది చాలా అవసరం. ఎందుకంటే మనలో తపన వున్నప్పుడు అది మన లక్ష్యం కోసం మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. తపన అనేది మనల్ని లక్ష్యానికి దగ్గరగా చేరుస్తుంది. మనం చేసే పనిలో శ్రద్ధ అనేది వుండాలి. ఎందుకంటే శ్రద్ధ వున్న వారికి దానిపై ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగే కొద్ది ఆ పని మనకు మరింత సులువుగా తయారవుతుంది.చేసేపని సులువయ్యే కొద్ది అధిక ఫలితాలు వస్తాయి. అందరూ అభినందిస్తారు. క్రమంగా ఆరంగంలో మరింత వున్నతంగా ఎదుగుతారు. అందరికి నిదర్శనంగా నిలిచిపోతారు. అందరూ మన సహాయం కోరుకుంటూ వస్తారు. అక్కడ మన విలువ మరింత పెరుగుతుంది.
కొంతమందికి సాధించాలన్న కోరిక వుంటుంది. సాధించాన్న తపన మాత్రం తక్కువగా వుంటుంది. సాధించాలన్న తపన లేనప్పుడు దానిని మనం సాధించలేము. తపన అనేది తప్పనిసరిగా వుండాలి. మనలో నేర్చుకోవాలన్న కోరిక ఎదగాలన్న తపన, రాణించాలన్న ఆరాటం, ఈ మూడు కూడా వున్నప్పుడే మనం మన లక్ష్యాన్ని సాధించగలము. మనం మన లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడుతున్నప్పుడు కొంచెం నష్టంగా, బాధగా వుంటుంది. కాని ఆ కష్టం నుంచి ప్రతిఫలాలు వస్తూ వుంటే చాలా ఆనందంగా వుంటుంది. ఈ ఆనందం ముందు ఆ క ష్టం మనకు గుర్తుకురాదు. కాని ఆ వచ్చిన ప్రతిఫలం మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే కష్టం లేకుండా సుఖం వుండదు. సుఖం లేకుండా కష్టం వుండదు. జీవితం అంటేనే సుఖదుఃఖాలమయం. కష్టం సుఖం రెండూ వున్నప్పుడు జీవితం విలువ మనకు తెలుస్తుంది. లేకపోతే తెలియదు.
* * *
ఇలాంటి ప్రేరణనిచ్చే వ్యాసాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

No comments:

Post a Comment