POSTMAN , MAIL GUARD, MTS ఖాళీలకు వ్రాత పరీక్ష ఆయా సంవత్సరములకు విడివిడి గా నిర్వహించ బడును.
గత ఉత్తర్వుల ప్రకారం ఒకే నోటిఫికేషన్ తో 3 సం . ల ఖాళీలకు ఒకే సారి పరీక్ష నిర్వహించబడవలసి యున్నది.
దీని వలన అర్హులైన జి.డి.ఎస్ లకు మూడు సార్లు గా మూడు సంవత్సరముల ఖాళీలకు గాను పరీక్షకు హాజరయ్యే అవకాశము లేదు.
గత ఉత్తర్వులను మార్పు చేస్తూ ఆయా సంవత్సరముల ఖాళీలకు విడివిడి గా పరీక్ష నిర్వహించ వలసినదిగా ఉత్తర్వులు వెలువడినవి.
దీని ప్రకారము 2011, 2012 & 2013 సంవత్సరముల లోని ఖాళీలకు మూడు మార్లుగా పరీక్ష నిర్వహించ బడును.
ఈ ప్రక్రియ 2013, జూన్ 30 వ తేది లోగా పూర్తి చేయవలసి వుంటుంది.